: అభిమాననటుడి పక్కన ఐదు గంటలు కూర్చుంటే...!


అభిమాన నటుడి పక్కన, అందులోనూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి సుమారు ఐదు గంటల పాటు ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుంది. ఓహో! ఆ సంతోషానికి హద్ దేవుండదు కదా? సరిగ్గా, ఇదే అదృష్టం తమిళనటుడు కాళిదాస్ జయరాంను వరించింది. ఈరోజు మలేషియాకు వెళ్తున్న సమయంలో తన పక్క సీట్లో కూర్చుని ఉన్న రజనీకాంత్ ని చూసి జయరాంకు నోటమాటరాలేదు. సుమారు ఐదు గంటల పాటు రజనీకాంత్ కలిసి ప్రయాణం చేయడంతో ఎంతగా సంబరపడిపోయానోనని జయరాం తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. రజనీతో కలిసి దిగిన ఒక సెల్ఫీని జయరాం పోస్ట్ చేశాడు. ‘రజనీ’ అంటే తనకెంతో ఇష్టమని, జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలవాలని అనుకునేవాడినని.. అట్లాంటిది ఆయనతో కలిసి ఏకంగా ఐదు గంటలు ప్రయాణం చేసే అవకాశం రావడం, పలు విషయాలపై రజనీకాంత్ తో మాట్లాడటం తనకు ఊహకు కూడా అందని విషయమన్నాడు.

  • Loading...

More Telugu News