: ప్రభుత్వాన్ని నేను నడపడం లేదు...ప్రతిసారి పాలనలో జోక్యం చేసుకోను: పవన్ కల్యాణ్


ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని తాను నడపడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నప్పుడు అందులో ఎప్పుడంటే అప్పుడు జోక్యం చేసుకోలేనని అన్నారు. తాను ప్రభుత్వానికి వత్తాసు పలకడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ రూపంలో అయినా ప్రజలకు నష్టం కలగడం అనేది తనకు ఇష్టం ఉండదని, అందుకే తాను పనులన్నీ వదిలేసి వచ్చానని ఆయన చెప్పారు. పోరాటం శాంతియుతంగా ఉండాలని భావించే వ్యక్తినని ఆయన చెప్పారు. ఉద్యమాలు చేసే నేతలు వాటి కార్యాచరణ కరెక్టుగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News