: అంత పెద్ద సభ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?: పవన్ కల్యాణ్


తునిలో అంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోందని పవన్ కల్యాణ్ నిలదీశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, సాధారణ సభ నిర్వహిస్తేనే డేగ కళ్లతో గమనించే ప్రభుత్వం దీనిపై ఎందుకు అలసత్వం ప్రదర్శించిందని ఆయన అడిగారు. కాపులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కమిషన్లతో ప్రయోజం లేదని భావించిన కాపులు నిన్న సభలో చర్చించాలని భావించారని ఆయన తెలిపారు. దీనిని రాజకీయ స్వార్థానికి వాడుకోవాలని భావించడం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలన్నీ కలిసి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. ఉద్యమం నడిపేటప్పుడు ఆ నాయకులు తప్పుదారిన నడవకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల సమస్య ఒక్కరోజులో తీరేది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా హక్కులు సాధించుకునేలా నేతలు ప్రవర్తించాలని ఆయన సూచించారు. శాంతి భద్రతల సమస్యలు రేకెత్తేలా ప్రవర్తించడం సరికాదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News