: ‘పద్మ’ పురస్కారంతో గౌరవించినందుకు ధన్యవాదాలు: రజనీకాంత్


భారతదేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కు తనను ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు చెప్పారు. సినిమా షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్తున్న ఆయన చెన్నై విమానాశ్రయం వద్ద ఈరోజు విలేకరులతో మాట్లాడారు. ఈ పురస్కారాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రజనీకాంత్ అన్నారు. కాగా, తనకు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ ద్వారా ‘రజనీ’ స్పందించారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కబాలి’, ‘రోబో-2’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News