: చంద్రబాబుకు చిరంజీవి బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్ నేత చిరంజీవి బహిరంగ లేఖరాశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆ లేఖలో తునిలో చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన కలిగించాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ, సామాజిక సంఘటనలు దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాపులు, బీసీలే కాకుండా రైతులు, మహిళలు రోడ్లెక్కే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. తక్షణం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని లేఖలో చిరంజీవి డిమాండ్ చేశారు.