: నా భార్యతో కలసి శుక్రవారం నిరాహార దీక్షకు దిగుతున్నా: ముద్రగడ
కాపు రిజర్వేషన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోని పక్షంలో శుక్రవారం నుంచి తన భార్యతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు తాను అనుభవించింది చాలని, ఇప్పటికైనా జాతికి మేలు చేయాలని ఆలోచిస్తున్నానని ఆయన తెలిపారు. అందుకే తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని ఆయన వెల్లడించారు. కాపుల కోసం దేనికైనా సిద్ధమని ఆయన చెప్పారు. అందుకే కాపులంతా తన వెంట ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తనకు రాజకీయాలు, డబ్బు ముఖ్యం కాదని ఆయన చెప్పారు. కాపులకు ఏదైనా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రిజర్వేషన్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు.