: బీసీ రిజర్వేషన్లలో వాటా మాకు వద్దండి...కొత్తగా కావాలి: ముద్రగడ
కాపులు బీసీలకు వ్యతిరేకమనే వాదన ఒకటి వినబడుతోందని, అది సరి కాదని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ఆయన మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లలో తాము వాటా అడగడం లేదని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు అమలు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో తమను చేర్చవద్దని ఆయన సూచించారు. జనరల్ కేటగిరీ కోసం ఉంచిన 50 శాతంలో తమకు వాటా కల్పించమని కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. దానికి ఏ పేరు పెట్టినా ఫర్వాలేదని చెప్పిన ఆయన, తమకు రిజర్వేషన్ అందులోంచే కావాలని డిమాండ్ చేశారు. ఇలా అడుగుతున్నందునే తమకు అందరూ మద్దతిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, తమకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.