: చెప్పండి... కాపు జీవో ఇచ్చేద్దామా?: మంత్రులతో సీఎం
కాపులను రిజర్వేషన్లకు దగ్గర చేస్తూ, ప్రభుత్వం తరఫున జీవోను జారీ చేద్దామా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు మంత్రులను ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం కాపు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ఒక్క జీవో జారీ చేస్తే, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పోతుందని వ్యాఖ్యానించగా, గతంలో కూడా జీవోలు జారీ అయ్యాయని, వాటిని ప్రజలిప్పుడు విశ్వసించబోరని మంత్రులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరినీ నొప్పింపకుండా, ప్రభుత్వానికి నష్టం కలుగకుండా చూసేలా ఏవైనా నిర్ణయాలుంటే చెప్పాలని చంద్రబాబు మంత్రులను కోరగా, ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సూచించినట్టు తెలుస్తోంది. కాపులను బీసీల్లో కలిపేందుకు తాను వ్యతిరేకం కాదని, ఇతర వర్గాల నుంచి వచ్చే విమర్శలను, ఉద్యమాలను తట్టుకోవాల్సి వుంటుందని చంద్రబాబు అన్నట్టు తెలిసింది.