: చంద్రబాబు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా?: ముద్రగడ సవాలు


తాను ఏ పార్టీతోనూ కుమ్మక్కు కాలేదని కాణిపాకం వరసిద్ధివినాయకుని ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో రేగిన అల్లర్లపై వివరణ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఒక పార్టీతో కుమ్మక్కయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబు కాణిపాకంలో వినాయకుని ముందు ప్రమాణం చేయగలరా? అని సవాలు విసిరారు. కాపులు ఊరికే అడగడం లేదని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు కాపులకు చేస్తామని చెప్పిన అంశాలనే అడుగుతున్నామని ఆయన తెలిపారు. కాపులను ఆదుకునేందుకు రిజర్వేషన్లు ఇచ్చితీరాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News