: 29 ఏళ్లుగా డీజీపీ స్థాయి అధికారి నన్ను వేధిస్తున్నాడు: ఐపీఎస్ అధికారిణి
గత 29 ఏళ్లుగా డీజీపీ ర్యాంక్ అధికారి తనను వేధిస్తున్నాడని కేరళకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖ ఆర్. ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ అకౌంటులో పోస్ట్ చేశారు. కేరళ ట్రాన్స్ పోర్ట్ అడిషినల్ డీజీపీ తొమిన్ జే తంచన్ గెరీ తనను వేధిస్తున్నాడంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. కేరళ ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా ప్రైవేటు బస్సులకు పర్మిట్లను మంజూరు చేశారన్న ఆరోపణల కారణంగా ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాతే తొమిన్ పై ఆమె ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, ఈ కేసుపై విజిలెన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు మంజూరు చేసిన వ్యవహారంలో తన పాత్రేమీ లేదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకే తొమిన్ కుట్ర పన్నారని శ్రీలేఖ ఆరోపించారు.