: విమానంలో తన్నుకున్న ఎయిర్ హోస్టెస్ లు... అత్యవసర ల్యాండింగ్!


అది లాస్ ఏంజిల్స్ నుంచి మిన్నియాపోలిస్ కు బయలుదేరిన డెల్టా ఎయిర్ లైన్స్ బోయింగ్ 757-200 విమానం. విమానం బయలుదేరిన తరువాత ప్రయాణికులకు సేవలందించాల్సిన ఎయిర్ హోస్టెస్ లు ఉన్నట్టుండి తన్నుకున్నారు. పని ఒత్తిడి ఎక్కువైందని, సేవల సంగతి నువ్వే చూసుకోవాలని ఓ ఎయిర్ హోస్టెస్ మరో ఎయిర్ హోస్టెస్ తో అనడంతో గొడవ మొదలైంది. వీరిద్దరి గొడవా సద్దుమణగక పోవడంతో, మధ్యలో కల్పించుకున్న వ్యక్తిని ఇద్దరూ కలిసి వాయించేశారు. దీంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ అధికారుల అనుమతితో విమానాన్ని సాల్ట్ లేక్ లో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. గొడవకు కారణమైన వారిని విధుల నుంచి తొలగించామని, 300 మంది ప్రయాణికులు పడ్డ ఇబ్బందులకు క్షంతవ్యులమని డెల్టా ఎయిర్ లైన్స్ ఓ బహిరంగ లేఖను రాసింది.

  • Loading...

More Telugu News