: అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్స్ కు భారత కుర్రాళ్లు!


అండర్ 19 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఢాకాలో జరిగిన మ్యాచ్ లో నేపాల్ పై భారత జట్టు అలవోకగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 48 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు, 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించారు. ఓపెనర్లు పంత్ 78, ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించగా, మిగిలిన పనిని ఎస్ఎన్ ఖాన్, అర్మాన్ జాఫర్ లు పూర్తి చేశారు. ఈ విజయంతో గ్రూప్ డీ నుంచి భారత జట్టు మొట్టమొదటిగా క్వార్టర్ ఫైనల్స్ పోరుకు స్థానం క్వాలిఫై అయింది. నేపాల్ బౌలర్లు ఎవరూ భారత జట్టుపై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు.

  • Loading...

More Telugu News