: వంగవీటి రంగా హంతకులు కోడెల, దేవినేనిలే!... జగన్ సంచలన వ్యాఖ్యలు
దివంగత వంగవీటి రంగా హత్య కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు వంగవీటి రంగాను హత్య చేసిన వారిలో ప్రధాన నిందితులైన కోడెల శివప్రసాద్ ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉంటే, మరో ప్రధాన నిందితుడైన దేవినేని ఉమా మహేశ్వరరావు మంత్రిగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కాపు గర్జన అల్లర్లు... వైసీపీ ప్రేరేపితమేని చంద్రబాబు ఆరోపించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ ఈ మేరకు సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి రంగా హత్య, అందుకు కారకులైన వారికి సంబంధించి హరిరామజోగయ్య సమగ్రంగా పుస్తకం రాశారని కూడా జగన్ పేర్కొన్నారు.