: కరుణాకర్ రెడ్డి డబ్బిచ్చాడు, వైకాపా వారొచ్చి విధ్వంసం చేశారు: సాక్ష్యాలున్నాయన్న చినరాజప్ప


రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేట్టుగా చూడాలని ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాపు గర్జన సభను వాడుకుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ సభకు ఆర్థిక సాయం చేశాడని తమ వద్ద సాక్ష్యాలున్నాయని చెప్పిన ఆయన, కడప జిల్లా నుంచి వచ్చిన రౌడీమూకల కారణంగానే అల్లర్లు జరిగాయని అన్నారు. అల్లర్ల వెనుక వైకాపా పాత్ర ఉందని, సదస్సుకు వచ్చిన ప్రజలను ముద్రగడ రెచ్చగొట్టాడని అన్నారు. ముద్రగడ పచ్చి అబద్ధాల కోరని, ఆయన మాటలను కాపు వర్గం విశ్వసించరాదని చినరాజప్ప కోరారు. కాపులకు ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పడిందని గుర్తు చేసిన ఆయన, కాపులను ఆదుకునేందుకు, వారిని బీసీల్లో కలిపేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News