: తార్నాకలో టీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ!


హైదరాబాద్ శివారు తార్నాక ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసును చుట్టుముట్టి ఫర్నీచర్ ను ధ్వంసం చేయగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. తక్షణం టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ స్థానిక నేతలకు వ్యతిరేకంగా పోలీసు కేసు పెట్టారు. రెండు కేసులనూ నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఘటనలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News