: అచారక శక్తులను టీడీపీనే ప్రోత్సహించింది!: సర్కారుపై ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు


తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన తమ సభ, ఉన్నట్టుండి హింసాత్మకంగా మారడంలో టీడీపీ ప్రభుత్వ పాత్ర ఉందని కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. నేటి సాయంత్రంలోగా కాపులకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ స్పష్టమైన జీవో జారీ చేయాలని డిమాండ్ చేసిన ఆయన నిన్నటి హింస నేపథ్యంలో కాస్తంత వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో తమ ఉద్యమంపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మీడియా ముందుకు వచ్చిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమంలో అల్లర్లు చెలరేగడానికి కారణమైన అరాచక శక్తులను టీడీపీనే ప్రోత్సహించిందని ముద్రగడ ఆరోపించారు. దాడులను తానెన్నడూ ప్రోత్సహించనని కూడా ముద్రగడ వ్యాఖ్యానించారు. పోలీసులు, మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి క్షమాపణ చెబుతున్నానని ఆయన చెప్పారుు. తనకు రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదని కూడా ముద్రగడ ప్రకటించారు.

  • Loading...

More Telugu News