: 'బాంబే టాకీస్..' పాటలో ప్రముఖ నటులు
భారతీయ సినిమా వందేళ్ల సంబరాలు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'బాంబే టాకీస్'. నాలుగు లఘు చిత్రాల మాలగా ఉండే ఈ చిత్రాన్ని దర్శకులు కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ రూపొందిస్తున్నారు. కాగా, 'అప్నా బాంబే టాకీస్..' పేరుతో ఇందులో ఓ పాటను తెరకెక్కించబోతున్నారు. 20 మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ఈ పాటలో కనిపిస్తారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ పాటలో నటిస్తున్న సంగతి ఇప్పటికే మీడియాలో వచ్చింది.
వీరితో పాటు కరీనాకపూర్, విద్యా బాలన్, ప్రియాంక చోప్రా, రాణిముఖర్జీ, షాహిద్ కపూర్, రణ్ బీర్ కపూర్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనె, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, శ్రీదేవి, కరిష్మాకపూర్, జూహ్లీచావ్లా ... ఇంకా పలువురు నటులతో మరింత అందంగా ఈ పాట కనిపించనుంది. వీరందరికి 20 మంది ప్రఖ్యాత గాయనీ గాయకులు తమ గాత్రాన్ని అందిస్తారు. మొదటిసారి ఇంతమంది గాయకులు ఒకేపాటలో భాగంగా కావడం ఒక విశేషమనే చెప్పాలి. కాగా, టైటిల్ ట్రాక్ ను ప్రధాన గాయకులు పాడుతున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ నృత్యాలను సమకూరుస్తున్నారు.