: తుని ఘటన యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది: డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్
కాపు ఐక్య గర్జన పేరిట నిన్న తునిలో జరిగిన సభ హింసాత్మకంగా మారడంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుని ఘటన యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడలో వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలు కాపు జాతికి శ్రేయస్కరం కాదని కూడా మండలి చెప్పారు. తుని ఘటనలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని కూడా మండలి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కాపు నాయకులు ఖండించకపోవడం దారుణమన్నారు. రిజర్వేషన్ల కోసం సాగిన సభ హింసాత్మకంగా మారడం బాధాకరమన్నారు. ఈ ఘటనతోనైనా ముద్రగడ పద్మనాభం తన చర్యలపై పునరాలోచించుకోవాలని మండలి సూచించారు.