: మూన్నాళ్ల ముచ్చటే!... వైసీపీకి మంత్రి దేవినేని సోదరుడి రాజీనామా!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని ఛంద్రశేఖర్ ముచ్చట ఎంతోకాలం కొనసాగలేదు. సోదరుడితో విభేదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్న చంద్రశేఖర్ ఆ పార్టీలో ఎంతోకాలం కొనసాగలేకపోయారు. కొద్దిసేపటి క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించిన చంద్రశేఖర్, ఆ కారణంగానే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.