: తుని అల్లర్లపై 35 కేసులు నమోదు... ఏడుగురు డీఎస్పీలతో దర్యాప్తు బృందాలు
తుని అల్లర్లపై ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు నేటి ఉదయానికి గాని తేరుకోలేకపోయారు. అది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాక గాని వారు ఆ షాక్ లో నుంచి బయటకు రాలేకపోయారు. కాపు ఐక్య గర్జన పేరిట హింసాకాండకు దిగిన దోషులను గుర్తించడమే కాక కేసులు కూడా పెట్టండని నేటి ఉదయం చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటికే పలు ఆధారాలు సేకరించిన పోలీసులు వెనువెంటనే కార్యరంగంలోకి దిగేశారు. తొలి విడతలోనే ఏకంగా 35 మంది కాపులపై కేసులు నమోదు చేశారు. ఇక మరింత మంది నిందితులను గుర్తించేందుకు ఏడుగురు డీఎస్పీలతో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు స్పీడుగా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది.