: విజయవాడ బయలుదేరలేక పోయిన చినరాజప్ప, యనమల... ఎయిర్ పోర్టులో పడిగాపులు!


ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆగిపోవడంతో పలువురు ఏపీ మంత్రులు విమానాశ్రయంలో వేచి చూస్తున్నారు. విజయవాడ పరిధిలో దట్టమైన పొగమంచు ఉండటం, గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కు అనుమతి లభించక పోవడమే ఇందుకు కారణం. దీంతో ఉదయం 7 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానానికి 11 గంటలు దాటుతున్నా అనుమతి లభించలేదు. ఈ విమానంలో విజయవాడకు వెళ్లాల్సిన ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడుతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీలు ఎదురు చూస్తున్నారు. విజయవాడలో పొగమంచు తొలగినట్టు సమాచారం అందగానే, టేకాఫ్ నకు అనుమతిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News