: చినరాజప్ప, గంటా, నారాయణ... అర్జెంటుగా రండి: చంద్రబాబు పిలుపు


ఏపీ ప్రభుత్వంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అత్యవసర సమావేశానికి పిలుపు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావులతో పాటు కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా వెంటనే రావాలని బాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. వీరందరితో మధ్యాహ్నం తరువాత సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్న చంద్రబాబు, ఒకవేళ ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు దిగితే తలెత్తే పరిస్థితులు, ఆపై తీసుకోవాల్సిన చర్యలపై వారిని అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం. ఉద్యమం తీవ్రరూపమైతే, నియంత్రణ సాధ్యం కాదని భావిస్తున్న ఏపీ మంత్రులు, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబుకు సూచించారు. ఇక కాపులకు రిజర్వేషన్లు ప్రకటించే దిశగా ముందడుగు పడితే, వెనుకబడిన తరగతుల నుంచి ఉద్యమం మొదలవుతుందని భావిస్తుండటంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సందేహాలున్నాయి.

  • Loading...

More Telugu News