: సురేంద్రబాబుకు విజయవాడ సీపీ బాధ్యతలు
విజయవాడ పోలీసు బాస్ గా సురేంద్రబాబు ఈ ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న గౌతమ్ సవాంగ్ 3వ తేదీ నుంచి సెలవుపై వెళ్లనున్న నేపథ్యంలో తాత్కాలిక పోలీసు కమిషనర్ గా సురేంద్రబాబును నియమిస్తున్నట్టు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గౌతమ్ సవాంగ్ గతంలోనే సెలవులో వెళ్లాల్సి వున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ఆయన తన సెలవును రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.