: ఇంత కుట్ర జరుగుతుంటే నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం


తునిలో జరిగిన కాపు గర్జన తరువాత హింసాత్మక పరిస్థితి ఏర్పడవచ్చని ముందుగానే అంచనా వేయడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని బాబు అభిప్రాయపడ్డారు. సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు తునిలో ఈ ఉదయం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరికాసేపట్లో రైల్వే జీఎం సహా పలువురు ఉన్నతాధికారులు నష్ట అంచనా నిమిత్తం రానున్నారు.

  • Loading...

More Telugu News