: ఠక్కర్ కు ‘హై టెన్షన్’ స్వాగతం... నేడు ఏపీ సీఎస్ గా బాధ్యతల స్వీకరణ
నవ్యాంద్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సత్య ప్రకాశ్ ఠక్కర్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాపు ఐక్య గర్జన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో నిన్న చోటుచేసుకున్న హింసతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న వార్తలతో విజయవాడ పోలీసుల చక్రబంధంలోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఠక్కర్ బాద్యతలు స్వీకరించక తప్పడం లేదు. ఎందుకంటే, ఇప్పటిదాకా సీఎస్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు నిన్న పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మొన్ననే ఎస్పీ ఠక్కర్ లాంఛనంగా సీఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి ఆయన సీఎస్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు.