: తుని అల్లర్లతో బెజవాడలో హైఅలర్ట్... భారీగా మోహరించిన పోలీసు బలగాలు


కట్టు తప్పిన కాపు ఐక్య గర్జనతో నెలకొన్న హైటెన్షన్ పరిస్థితులు ఒక్క తునికే పరిమితం కాలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలోనూ హై టెన్షన్ నెలకొంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు నిన్న రాత్రికే విశాఖ చేరుకున్నాయి. మరికాసేపట్లో ఆ బలగాలన్నీ తునికి చేరుకోనున్నాయి. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ నేటి సాయంత్రంలోగా స్పష్టమైన జీవో రావాలని, లేని పక్షంలో తాను ఆమరణ దీక్షకు దిగుతానంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో పరిస్థితులు మరోమారు చేయి దాటిపోకుండా ఉండేందుకే కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రకటన రాని పక్షంలో విజవాడలోనూ ఆందోళనకు దిగేందుకు కాపులు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అక్కడ కూడా హై టెన్షన్ నెలకొంది. దీనిపై ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున మోహరించారు. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో వేల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News