: ఆసీస్ ను చిత్తు చేసి టీ20ల్లో టాప్ ర్యాంకుకు దూసుకెల్లిన ధోనీ సేన!


ఆసీస్ పర్యటనలో తొలుత నాలుగు మ్యాచ్ లలో పరాజయం పాలైన టీమిండియా ర్యాంకుకేమీ ఇబ్బంది రాలేదు. అయితే ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ లలో కంగారూలను ఓ ఆటాడుకున్న ధోనీ సేన... ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టాప్ కు దూసుకెళ్లింది. నిన్నటి విజయంతో 139 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ మేరకు సంతోషకరమైన వార్త వినిపించింది. నిన్న విడుదలైన టీ20 ర్యాంకుల్లో... వరుసగా మూడు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇక వరుసగా మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన ఆసీస్ జట్టు 110 రేటింగ్ పాయింట్లతో ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇక 118 రేటింగ్ పాయింట్లతో ఉన్న వెస్టిండీస్, శ్రీలంకలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News