: తుని అల్లర్ల వెనుక వైసీపీ హస్తం: ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణ


తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన హింసాత్మకంగా మారడంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ హస్తం ఉందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వేగంగా స్పందించిన ఆయన అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన అత్యవసర భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుని అల్లర్ల వెనుక వైసీపీ హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రం ఏ ఒక్కరిదో కాదని పేర్కొన్న ఆయన... రాష్ట్రం ప్రజలందరిదని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తుని ఘటన దురదృష్టకరమన్నారు. తూర్పు గోదావరి జిల్లా చరిత్రలోనే ఇంతటి దుర్ఘటన ఎన్నడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, అల్లర్లకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే వారిని వదలబోమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News