: ‘తుని’ ఘటనలో జగన్ హస్తం: మంత్రి యనమల


‘తుని’ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ సంఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ వెయ్యిమంది తన అనుచరులను పంపి ఈ హింసను ప్రేరేపించాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అన్నీ గమనిస్తోందని, తగిన సమయంలో చర్యలు తీసుకుంటుందని అన్నారు. గతంలో జరిగిన కాపు ఉద్యమాలన్నీ శాంతియుతంగా జరిగాయని యనమల అన్నారు. కాగా, ఈ సంఘటనపై టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్, తోట త్రిమూర్తులు, పల్లె రఘునాథరెడ్డి కూడా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సమావేశం ఏర్పాటు చేసిందని, ఆ సమావేశంలో చర్చించిన విధంగానే ఈరోజు ఈ విధ్వంసానికి వారు పాల్పడ్డారని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News