: కాసేపట్లో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం!
తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు కాసేపట్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు రావాలని మంత్రులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులకు ఈమేరకు ఆదేశాలు అందాయి. తుని ఘటనపై చంద్రబాబు సమీక్షించనున్నట్లు సమాచారం. కాగా, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలకు ‘కాపు ఐక్య గర్జన’ ఆందోళనకారులు నిప్పుపెట్టిన సంఘటనలో ప్రయాణికులు పరుగులు తీశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించారు. ఈ సంఘటనలో రైల్వే సిబ్బందికి, పోలీసులకు గాయాలైన సంఘటన తెలిసిందే.