: రైలు బోగీలకు నిప్పు పెట్టిన ‘కాపు గర్జన’ ఆందోళనకారులు!


తూర్పు గోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలకు ‘కాపు ఐక్య గర్జన’ ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఐదు బోగీల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. కాగా, ‘కాపు’ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈరోజు నిర్వహించిన కాపు ఐక్య గర్జన సదస్సు ఆందోళనపథంలోకి మారింది. కాపులను బీసీల్లో చేర్చాలని, టీడీపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలంటూ ‘కాపు ఐక్య గర్జన’ కార్యకర్తలతో పాటు పలు రాజకీయపార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చుతున్న జీవోలు వెలువడే వరకు ఇళ్లకు వెళ్లే సమస్యే లేదని.. రైల్ రోకో, రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ముద్రగడ పద్మనాభం వెంటనే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News