: ఆ సామెతను అక్షరాలా పాటిస్తున్నాం: మంత్రి కేటీఆర్
‘ఇల్లు కట్టి చూశాడు...పెళ్లి చూశాడు’ అనే సామెతను తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా పాటిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లోని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్స్ కట్టించి ఇస్తున్నామని, పేద యువతులకు పెళ్లి చేసేందుకు గాను ‘కల్యాణ లక్ష్మి’ పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఇవి రెండూ చాలా ముఖ్యమైనవని వాటిని ప్రజలకు అందిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.