: మిత్రమా కేసీఆర్... 5న ఇక్కడే ఉంటా, ఎక్కడికీ పోను, చూసుకుందాం: సీపీఐ నారాయణ స్పందన
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున సీపీఐ నేత నారాయణ చెవులను ఎవరైనా కోస్తారని, నగరంలో ఉండవద్దని నిన్న రాత్రి జరిగిన సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ తనకు మిత్రుడేనని చెబుతూనే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని మెత్తగా మొత్తారు. "నేను ఎన్నడూ భయపడను. 5వ తేదీన ఇక్కడే ఉంటాను. ప్రజలను నాపై రెచ్చగొట్టాలని చూస్తున్నావు. హుందాగా ఉండు, కేసీఆర్" అంటూ ఆయన తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ఒంటరిగా గెలిస్తే చెవులు కోసుకుంటానని చెప్పానని, తన మాటలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ కే నష్టమని, 5న ఇక్కడే ఉంటానని, ఏం జరిగినా చూసుకుంటానని అన్నారు.