: టీడీపీ అంతా కాపులే: ఎమ్మెల్యే బోండా


కాపు గర్జనను అడ్డుకునే అవసరం ప్రభుత్వానికి లేదని, కాపు సామాజిక వర్గం టీడీపీతోనే ఉందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. బీజేపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ నుంచి కాపులను వేరు చేయలేరని అన్నారు. కాపు కార్పొరేషన్ కోసం రూ.100 కోట్లు కేటాయించామని, కాంగ్రెస్ హయాంలో కాపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాపు అంశాన్ని ఆ పార్టీలు తెరపైకి తెస్తున్నాయని ఉమ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణకు తమ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News