: 15 పరుగుల తేడాతో ఓడిన భారత మహిళా క్రికెట్ టీం... కప్పు మాత్రం మనదే!


భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన మూడవ టీ-20 పోరులో ఆస్ట్రేలియా జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లను భారత్ గెలుచుకుని ఉండటంతో, ట్రోఫీ భారత్ కే దక్కింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పెర్రీ 55 పరుగులతో ఆకట్టుకోగా, మూనీ 36, లాన్నింగ్ 26 పరుగులు చేశారు. 137 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఎవరూ రాణించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత జట్టు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, మరికాసేపట్లో ధోనీ టీం మూడవ టీ-20 ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఇండియా భావిస్తుండగా, ఇదైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది.

  • Loading...

More Telugu News