: ఏపీ డీఎస్సీ షెడ్యూల్ విడుదల... రేపు మెరిట్ లిస్ట్


ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మెరిట్ లిస్టును రేపు ఆన్ లైన్ లో ఉంచుతామని వెల్లడించిన ఆయన, ఫిబ్రవరి 5లోగా సెలక్షన్ లిస్టును ఫైనల్ చేస్తామని తెలిపారు. 8వ తేదీన జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని, మార్చి 1న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని గంటా తెలియజేశారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 5న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ సంవత్సరం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News