: పక్కకు ఒరిగిన మెట్రో లాంచింగ్ ప్యాడ్... సికింద్రాబాద్ లో హై అలర్ట్!


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న మెట్రో పనులు తాత్కాలికంగా నిలిచిపోగా, ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. మెట్రో పిల్లర్ కు, పిల్లర్ కు మధ్య బ్రిడ్జ్ ని పట్టివుంచే లాంచింగ్ ప్యాడ్ పక్కకు ఒరగడంతో వెంటనే స్పందించిన అధికారులు సమీపంలోని హోటళ్లను, లాడ్జీలను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను పక్కకు మళ్లించారు. లాంచింగ్ ప్యాడ్ ను తిరిగి యథాస్థానంలో నిలిపేందుకు మరింత సమయం పడుతుందని, ఈలోగా ఎటువంటి అవాంఛనీయ ఘటనా జరుగకుండా హై అలర్ట్ ప్రకటించామని అధికారులు వెల్లడించారు. కాగా, వందల టన్నుల బరువుండే లాంచింగ్ ప్యాడ్ కిందకు పడితే పెను నష్టం జరుగుతుందన్న భావనతో సమీప భవనాల్లోని ప్రజలను హెచ్చరించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News