: గన్నవరంలో దిగలేక అరగంట చక్కర్లు కొట్టి వెనుదిరిగిన ఎయిర్ ఇండియా విమానం!
ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కాలేక వెనుదిరిగి వచ్చింది. విమానాశ్రయంపై దట్టమైన పొగమంచు అలముకున్న కారణంగానే విమానం ల్యాండింగ్ సమస్యలను ఎదుర్కొందని అధికారులు ప్రకటించారు. ల్యాండింగ్ కు అనుమతి కోసం దాదాపు అరగంట పాటు ఎదురుచూసిన పైలెట్ కు అనుమతి లభించకపోవడంతో, విమానాన్ని వెనక్కు మళ్లించినట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా విమానం వెనక్కు వెళ్లిన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి రావాల్సిన మరో విమానానికి అక్కడే టేకాఫ్ నకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.