: గొయ్యి తవ్వుకొని మరణం కోసం ఎదురుచూస్తున్న కడప వాసి... మీరూ చూడండి!
ఆయన వయసు 70 సంవత్సరాలు. కడపలో హోల్ సేల్ కిరోసిన్ వ్యాపారి. తన మరణానంతరం ఎవరికీ శ్రమ కలగకూడదన్న ఉద్దేశంతో, తనను పూడ్చిపెట్టడానికి తానే గొయ్యి తవ్వుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కె.వెంకటయ్య అనే వ్యక్తి, ఆరు నెలల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి, నానమ్మ దగ్గర పెరిగాడు. వ్యాపారంలో స్థిరపడి, తన ఐదుగురు కుమారుల వివాహాలు చేశాడు. ఇటీవల భార్య చనిపోయిన తరువాత వైరాగ్యం బాట పట్టాడు. మరణిస్తే, ఏమీ తీసుకుపోలేమని చెబుతుండే ఆయన, తానిప్పుడు మరణం కోసం ఎదురుచూస్తున్నానని అంటున్నాడు. ఆ వీడియోను మీరూ చూడండి.