: వేలాది బైకులతో, లోకేశ్ నేతృత్వంలో... కదిలిన తెలుగు తమ్ముళ్లు


తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆ పార్టీ తలపెట్టిన బైక్ ర్యాలీ కొద్ది సేపటిక్రితం హైటెక్ సిటీ నుంచి ప్రారంభమైంది. నేటితో గ్రేటర్ ఎన్నికలకు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో లక్ష మందితో టీడీపీ-బీజేపీ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. హైటెక్ సిటీ నుంచి మొదలయ్యే ర్యాలీ కొండాపూర్, హఫీజ్ పేట, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, మూసాపేట, మోతీనగర్, బోరబండ, పెద్దమ్మ టెంపుల్, పంజాగుట్టల మీదుగా నక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ వరకూ జరగనుంది. ఎక్కడికక్కడ డివిజన్ల నుంచి భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు వచ్చి ర్యాలీలో చేరుతాయని టీడీపీ నేతలు తెలిపారు. లోకేశ్ ప్రయాణిస్తున్న బైక్ ముందు కదలగా, దాదాపు 5 వేలకు పైగా బైకులపై తెలుగుదేశం జెండాలు చేతబట్టిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ, హైటెక్ సిటీ నుంచి ముందుకు కదిలారు.

  • Loading...

More Telugu News