: బ్రిటన్ హెలికాప్టర్ ను కూల్చివేసిన టాంజానియా వేటగాళ్లు... పైలెట్ దుర్మరణం


టాంజానియాలో వేటగాళ్ల బారి నుంచి ఏనుగులను కాపాడేందుకు వెళ్లిన బ్రిటన్ హెలికాప్టర్ ను కూల్చివేసిన ఘటనలో పైలెట్ రోజర్ గోవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సెరంగిటీ నేషనల్ పార్క్ ను ఆనుకొని ఉన్న మస్వా గేమ్ రిజర్వ్ పరిధిలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. టాంజానియా వైల్డ్ లైఫ్ అధికారులతో కలసి చేపట్టిన సంయుక్త సోదాల్లో భాగంగా, ఏనుగుల వేటగాళ్లను అరెస్ట్ చేసే నిమిత్తం హెలికాప్టర్ బయలుదేరి వెళ్లిందని, దాన్ని వేటగాళ్లు పేల్చి వేశారని ఫ్రెడ్ కిన్ కన్సర్వేషన్ ఫండ్ చైర్మన్ డాన్ ఫ్రెడ్ కిన్ వెల్లడించారు. తమ వద్ద ఉన్న తుపాకులతో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పై వారు కాల్పులు జరిపారని తెలిపారు. వేటగాళ్లు మూడు ఏనుగులను చంపినట్టు గమనించిన రోజర్, ఆ ప్రాంతంలో దిగేందుకు ప్రయత్నించిన సమయంలో ఘటన జరిగినట్టు వివరించారు. టాంజానియాలో బ్రిటన్ పౌరుడు మరణించిన ఘటనను నిర్ధారించిన ఆ దేశ ప్రభుత్వం, దీన్నో దురదృష్టకర ఘటనగా అభివర్ణించింది. ఈ కష్ట సమయంలో రోజర్ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News