: సౌదీ నుంచి ఉగ్రవాదం కోసం పాక్ కు 'నిధుల సునామీ': అమెరికా


మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, ముఖ్యంగా చిన్నారుల్లో షియా వ్యతిరేక భావాలను నూరిపోసేందుకు పాకిస్థాన్ లోని సుమారు 24000 మదారసాలకు సౌదీ అరేబియా నుంచి నిధుల సునామీ సాగుతోందని అమెరికా సెనెటర్ క్రిస్‌ ముర్ఫీ ఆరోపించారు. చిన్నారుల్లో ఉగ్రభావాలు కలుగుతున్నాయని చెప్పడానికి పాకిస్థాన్ అత్యుత్తమ ఉదాహరణని ఆయన అన్నారు. ‘కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌’ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, 1956లో ఉన్న 244 ఉన్న మదారసాలు నేడు 24000లకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మదారసాల సంఖ్య పెరుగుతోందని, అవేవీ అల్-ఖైదా లేదా ఐఎస్ఐఎస్ కు అనుకూలంగా లేనప్పటికీ, వాటిల్లో పిల్లలకు బోధిస్తున్న విద్య ముస్లింలలో విభజనను ప్రోత్సహిస్తూ, పశ్చిమ తీవ్రవాదాన్ని నెమ్మదిగా చిన్నారుల మనసుల్లోకి చొప్పిస్తోందని ఆరోపించారు. 1960 నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లు సౌదీ నుంచి నిధుల రూపంలో పలు దేశాల మదారసాలు, మసీదులకు వచ్చాయని తెలిపారు.

  • Loading...

More Telugu News