: రవిశంకర్ తరపున అవార్డును అందుకున్న కుమార్తెలు
సంగీత విద్వాంసులు, దివంగత పండిట్ రవిశంకర్ కు లభించిన జీవన సాఫల్య గ్రామీ అవార్డును ఆయన కుమార్తెలు అనౌష్క, నోరాలు అందుకున్నారు. అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన ప్రీ గ్రామీ ఉత్సవాలకు వీరు హజరయ్యారు.
రవిశంకర్ సంగీత వారసత్వాన్ని కుమార్తెలిద్దరూ అందిపుచ్చుకున్నారు. తండ్రి రవిశంకర్ తో కలిసి వివిధ దేశాల్లో అనౌష్క కచేరీల్లో పాల్గొంది. గేయకర్తగా, గాయనిగా మరో కుమార్తె నోరా తొమ్మిది సార్లు గ్రామీ అవార్డులు గెలుకుంది. అవార్డు స్వీకరణ సందర్భంగా తండ్రితో తమ అనుబంధాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు.