: విశ్రాంతి నిమిత్తం వెళ్లిపోయిన కేసీఆర్, ఎన్నికల అనంతరమే తిరిగి రాక!
జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, నిన్న రాత్రి 9 గంటల సమయంలో మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని ఎర్రవెల్లిలో ఉన్న ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. పెరేడ్ గ్రౌండ్స్ లో సభ ముగిసిన వెంటనే ఆయన కాన్వాయ్ ఎర్రవెల్లి దిశగా సాగిపోయింది. ఇక, నేడు, రేపు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. 2వ తేదీన ఎన్నికలు జరిగే సమయానికి ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు వివరించారు. నిత్యమూ నేతలతో ఎన్నికల సమాలోచనలు, పరిపాలనా పరమైన సమావేశాలతో గత కొంతకాలంగా బిజీగా గడిపి అలసినందునే, ఎర్రవెల్లికి వెళ్లారని సమాచారం.