: టీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లోను ఓటేయను: భువనేశ్వరి
నిన్న కేసీఆర్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో "చంద్రన్నా, అడిగి చూడు, మా వదిన భువనేశ్వరి ఓటు కూడా మాకే వేస్తుంది" అని వ్యాఖ్యానించడాన్ని భువనేశ్వరి ఖండించారు. ఆమె స్పందనను ట్విట్టర్ లో నారా లోకేశ్ పోస్టు చేశారు. "కేసీఆర్ వ్యాఖ్యలకు మా అమ్మ జవాబిది" అంటూ, "ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బహిరంగ సభలో నేను టీఆర్ఎస్ కు ఓటేస్తానని కేసీఆర్ చెప్పడం నన్ను భయాందోళనకు గురిచేసింది. ఇది చాలా దురదృష్టకరం మరియు ఆయన ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు నన్ను ఎంచుకున్నారు. నా ఓటు ఎప్పటికీ టీడీపీకే" అని భువనేశ్వరి వ్యాఖ్యానించినట్టు తెలిపారు.