: హయత్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై దాడి


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హయత్ నగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముత్యాల చంద్రశేఖర్‌ రావుపై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కొందరు దాడికి పాల్పడ్డారు. పోలీసుల వెల్లడించిన ప్రకారం, తన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మదర్‌ డైరీ సమీపంలో కొందరు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడి చేశారు. ప్రాణభయంతో చంద్రశేఖర్ కారు దిగి పరుగు పెట్టగా, వెనుకనుంచి వచ్చి కత్తితో దాడి చేశారు. అటువైపుగా ఓ బైకుపై వస్తున్న వ్యక్తి సాయంతో తప్పించుకుని ఆసుపత్రిలో చేరారు. దుండగులు ముసుగు ధరించి వచ్చారని చెప్పారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చంద్రశేఖర్ రావుకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News