: నేను చనిపోయానంటూ ప్రచారం చేస్తున్నారు... పోలీసులకు దాసరి ఫిర్యాదు


పలు సామాజిక మాధ్యమాల్లో తాను మరణించినట్టు కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దర్శకరత్న దాసరి నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్ లో తన గురించి ఈ తరహా పోస్టులు వస్తున్నాయని, వీటిని చూసిన అభిమానులు, మిత్రులు తన యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతున్నారని హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులకు ఆయన కంప్లయింట్ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోందని, దీనిపై విచారించి, తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News