: తొలిసారి తొడగొట్టిన చంద్రబాబునాయుడు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి తొడగొట్టారు. అయితే, అది గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అని మేరు ఊహించి ఉంటే కనుక, మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్టణంలో ప్రోకబడ్డీ లీగ్ ప్రారంభించిన చంద్రబాబునాయుడు ఆ సందర్భంగా బాల్యాన్ని గుర్తు చేసుకుని తొడగొట్టారు. తెలుగు టైటాన్స్-యు ముంబయ్ క్రీడాకారులను ఉత్సాహపరచడంలో భాగంగా ఆయన తొడగొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యమని అన్నారు. ఆ ఒలింపిక్స్ లో కబడ్డీ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. అనంతరం బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి మ్యాచ్ ను వీక్షించారు.

  • Loading...

More Telugu News