: హైదరాబాదును కేటీఆర్ చేతుల్లో పెడతా!: కేసీఆర్
తన దగ్గర ఉన్న మున్సిపల్ శాఖను మంత్రి కేటీఆర్ కు అప్పగిస్తానని కేసీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ కు హైదరాబాదులో ఎక్కడ ఏముందో తెలుసని, ఆయనైతే అన్నీ సక్రమంగా చక్కబెడతారని, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే ఆయనకు మున్సిపల్ శాఖ అప్పగిస్తానని కేసీఆర్ తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి తరువాత అత్యధిక శాఖలు కేటీఆర్ చేతిలో ఉండనున్నాయి.