: చంద్రబాబూ...ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు: కేసీఆర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాదుపై ప్రేమ ఉందని చెబుతున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హైదరాబాదు ప్రజలకు చక్కిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు ప్రేమ ఏంటో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. 'చంద్రబాబూ...దేశంలో కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టింది నువ్వు కాదా? దీనికి సమాధానం చెప్పాలి' అంటూ డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాసింది, కాస్తున్నది చంద్రబాబు కాదా? అని ఆయన నిలదీశారు. విద్యుత్ ధరలు తగ్గించమని ప్రజలు రోడ్డెక్కితే వాళ్లని బషీర్ బాగ్ సర్కిల్ లో తుపాకులతో కాల్పించింది చంద్రబాబు కాదా? అని అడిగారు. అంగన్వాడీ మహిళలు జీతాలు అడిగితే గుర్రాలతో తొక్కించింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నాడని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా చెయ్యాలని ఉంటే ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News